భవిష్యత్ తరాల కోసం పటిష్ఠ నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర గ్రామంలో ఏర్పాటు చేసిన తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొదటి సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం తెరాస పార్టీ ఇంఛార్జ్ బస్వరాజు సారయ్య, పార్టీ నాయకులు కార్యకర్తల నమోదు ప్రక్రియ చేపట్టారు.
ఇదీ చదవండి: కుల, మతాలతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్ర: మేయర్