ETV Bharat / state

Huzurabad: ఎవరైతే బాగుంటుంది... హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు - Huzurabad by-election

హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు నివేదికలు తెప్పించుకుకొని... వివిధ సామాజిక, రాజకీయ కోణాల్లో విశ్లేషిస్తూ కసరత్తు చేస్తోంది. ఈటల రాజేందర్​పై పోటీగా బీసీ ఉద్యమ నేతనే బరిలోకి దించాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం... తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​యాదవ్ పట్ల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరాసలో చేరిన మాజీ మంత్రులు ఎల్. రమణ, పెద్దిరెడ్డితో పాటు స్వర్గం రవి, కృష్ణమోహన్ తదితరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు
హుజూరాబాద్ ఉపఎన్నికపై తెరాస కసరత్తు
author img

By

Published : Aug 4, 2021, 5:36 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)ను సవాల్​గా తీసుకున్న తెరాస (TRS)... అభ్యర్థి ఖరారు కోసం కసరత్తు చేస్తోంది. ఓ వైపు హుజూరాబాద్ అభివృద్ధి, సంక్షేమ పథకాల జల్లు కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ... అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈటల రాజేందర్ (Etela Rajender)... తెరాసను వీడినప్పటి నుంచే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్​తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలందరూ అభ్యర్థి ఖరారు లేకుండానే సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.

మంత్రి హరీశ్​రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెరవెనుక మంత్రాంగంలో నిమగ్నమై ఉన్నారు. సీఎం కేసీఆర్... పార్టీ నేతలకు నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రధానంగా ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో గులాబీ పార్టీ కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

ఎంపిక సవాల్...

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల వెంట ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తెరాసకు... అభ్యర్థి ఎంపిక కూడా సవాల్​గానే మారింది. తెరాసలో ఇన్నాళ్లు ఈటల రాజేందర్​దే ఏకచ్ఛత్రాధిపత్యంలా సాగింది. అభ్యర్థి ఎంపిక పట్ల అధికార పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈటల రాజేందర్​కు ముందు నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉండేవారు. కాబట్టి కాంగ్రెస్ నుంచి చేరిన కౌశిక్​రెడ్డికి టికెట్ ఇస్తారని ఒక దశలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

అనేక మంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ... గత ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్​రెడ్డికి అనూహ్యంగా నామినేటెడ్ కోటాలో అవకాశం ఇచ్చారు. మరోవైపు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు ఎస్సీ వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్​ను నియమించారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు...

బీసీ నేతనే హుజూరాబాద్​లో బరిలోకి దించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఉద్యమ, బీసీ నేతగా ఈటల రాజేందర్ ప్రచారం చేసుకుంటున్నందున.. ఆ రెండు నేపథ్యాలున్న నాయకుడికే టికెట్ ఇవ్వాలనే దిశగా వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన తెరాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఓయూ విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేపథ్యంతో పాటు స్థానికుడు కావటం గెల్లు శ్రీనివాస్ యాదవ్​కు కలిసొచ్చే అంశంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. నియోజకవర్గానికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్, ఇతర ముఖ్యనేతలు నిర్వహిస్తున్న సమీక్షలకు గెల్లు శ్రీనివాస్ ​యాదవ్ హాజరువుతున్నారు.

పరిశీలనలో రమణ పేరు...

చేనేత వర్గాల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నందున.. మాజీ మంత్రి ఎల్.రమణ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఎల్. రమణను పోటీకి దించితే స్థానికేతరుడని.. ఉద్యమంలో క్రియాశీలకంగా లేరని ప్రత్యర్థులు ప్రచారం చేయవచ్చునని వెనకా ముందాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరాసలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్వర్గం రవి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కృష్ణమోహన్ తదితరులు కూడా రేసులో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈనెల రెండో వారంలో అభ్యర్థిని గులాబీ బాస్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇదీ చూడండి: Huzurabad By Election: సర్వత్రా ఉత్కంఠ.. హుజూరాబాద్ తెరాస అభ్యర్థి ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.