ETV Bharat / state

Huzurabad By Election Campaign: పదునెక్కిన ప్రచారం... నువ్వానేనా అంటోన్న తెరాస, భాజపా

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రచార (Huzurabad By Election Campaign) జోరు పెంచాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార తెరాస(Trs), విపక్ష భాజపా (Bjp) నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్న నాయకులు వ్యక్తిగత విమర్శలతో హోరెత్తిస్తున్నారు. హుజూరాబాద్‌ సమగ్రాభివృద్ధికి పాటపడతామంటూ హామీలు గుప్పిస్తున్నారు.

Huzurabad
హుజూరాబాద్‌
author img

By

Published : Oct 4, 2021, 5:07 AM IST

పదునెక్కిన ప్రచారం... నువ్వానేనా అంటోన్న తెరాస, భాజపా

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ ఉపఎన్నికలో ప్రచారం (Huzurabad By Election Campaign) ఊపందుకుంది. అందరి బాధలు తీర్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm Kcr) ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఓటర్లను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) కోరారు. హనుమకొండ మండలం కమలాపూర్‌లో నిర్వహించిన ధూమ్​ధామ్​ కార్యక్రమానికి తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌(Gellu Srinivasa Rao)తో కలిసి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ (Cm Kcr)కు మానవత్వం లేదన్న ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యాఖ్యలను హరీశ్‌రావు తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తెచ్చిన పథకాల ఫలాలు అనుభవిస్తున్న లబ్ధిదారులను అడిగితే మానవత్వం గురించి చెబుతారని స్పష్టం చేశారు. సామాన్యులపై ధరల భారాన్ని మోపుతున్న భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని హరీశ్‌ కోరారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా...

హుజురాబాద్‌లో నిర్వహించిన భాజపా ఎన్నికల శంఖారావం సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. తెరాస ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈటల రాజేందర్‌ అసెంబ్లీలో అడుగు పెడతారని భాజపా రాష్ట్ర బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస ఓడిపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అని బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

అంతిమ విజయం ధర్మానిదే...

జమ్మికుంట మండలం ధర్మారంలో జరిగిన ప్రచారసభలో తెరాసపై ఈటల విమర్శలు గుప్పించారు. హుజురాబాద్‌ నుంచే తెరాస పతనం ప్రారంభం కావాలని నేతలు సూచించారు. తన రాజీనామాతోనే పడకేసిన పథకాలను పరుగులు పెట్టించి అమలుచేస్తున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎన్ని డబ్బుల సంచులతో ఏమార్చాలని చూస్తున్నారని, అంతిమ విజయం ధర్మానిదేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.