నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా... కరీంనగర్ జిల్లా వీణవంకలో రైతులు భారీ ట్రాక్టర్ల ప్రదర్శన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ జిందాబాద్ అంటూ తెరాస కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రెడ్డిపల్లి నుంచి సుమారు 500 ట్రాక్టర్లతో వీణవంక మండల కేంద్రం వరకు ర్యాలీని చేపట్టారు.
నూతన చట్టంతో తమకు ఎంతో మేలని రైతులు పేర్కొన్నారు. తమ ఇబ్బందులన్నీ తొలగిపోయాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.