కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పర్యటించారు. వీణవంక మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ నెలకొన్న రైతుల సమస్యలను జిల్లా పాలనాధికారి శశాంక దృష్టికి తీసుకెళ్లారు. తాలు పేరుతో మిల్లర్లు 42 కిలోల్లో రెండు కిలోలు కోత విధిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని పొన్నం ఆరోపించారు.
బీ గ్రేడ్ ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పొన్నం విమర్శించారు. అదనంగా తూకం వేయమని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా అని జిల్లా మంత్రులను ప్రశ్నించారు. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2500 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. ఇక్కడ రూ.1800పై చిలుకు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనలను సడలించి రైతులు, మిల్లర్లతో మాట్లాడాలన్నారు. ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తోందన్నారు.
ఇదీ చూడండి: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి ప్రమాణం