ETV Bharat / state

ఆ బాలగోకులంలోకి వెళితే మనసు సేవాపరిమళంతో సేదతీరుతుంది! - అనాథ పిల్లలకు ఆశ్రయమిస్తున్న బాలగోకులం

అనాథలను అక్కున చేర్చుకుంటుంది..ఆ బాలగోకులం... ఎవరూలేని వారికి అన్నీ తామై కన్న ప్రేమను పంచుతారు అక్కడి నిర్వాహకులు. ప్రతి గెలుపులోను, మలుపులోను.. ప్రతి అడుగులోను బాటలు వేస్తూ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోడానికి మార్గం చూపిస్తోంది గంప ఫౌండేషన్. మీ లక్ష్యం మా అభిమతం అంటూ మోడివారిన బాలల జీవితాల్లో చిగురులు తొడిగించి... భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న బాలగోకులంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Venkat Foundation, balagopalam
ఆ బాలగోకులంలోకి వెళితే మనసు సేవాపరిమళంతో సేదతీరుతుంది!
author img

By

Published : Jun 19, 2020, 5:11 AM IST

కరీంనగర్ దిగువ మానేరు జలాశయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తపోవనంలా కనిపిస్తోంది బాలగోకులం. పేరుకు తగ్గట్టుగా అక్కడికి వెళితే మనసును సేవాపరిమళం కూడా పలకరిస్తోంది. గోకులం ప్రాంగణం చూస్తుంటే ఒకే కుటుంబానికి చెందిన పిల్లలంతా ఇంటి పనులు చేసుకుంటున్నారా... అనిపిస్తోంది. కాని వాస్తవానికి వారంతా విధి ఆడిన నాటకంలో అనాథలుగా మారి తల్లిదండ్రుల ప్రేమ కోసం ఓగూటికి చేరిన పక్షులు. కేవలం కరీంనగర్ జిల్లా వాసులే కాదు.. అనాథ పిల్లలు ఎవరున్నా తమకు సమాచారం అందిస్తే అక్కున చేర్చుకుంటోంది ఈ గోకులం.

అలా మొదలైంది

జీవితంలో వ్యాపార పరంగా స్థిరపడి సమాజానికి తమవంతు సాయపడాలనే ఎనిమిది మంది స్నేహితుల లక్ష్యం ఈ బాలగోకులానికి ఊపిరిపోసింది. 2010లో వెంకట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజసేవకు ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో వెంకట్ ఫౌండేషన్‌ ఛైర్మెన్‌ గంప వెంకట్‌ తన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో అనాథశరణాలయం అని కాకుండా బాలగోకులం పేరుతో స్థాపించారు. సొంత భవనం నిర్మించడమే కాకుండా... స్నేహితులంతా కలిసి నెలకు సుమారు లక్షా 20వేల రూపాయల వరకు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు. అయిన వాళ్లకు దూరమైన తమను అక్కున చేర్చుకుని... భవిష్యత్తుకు బాటలు వేస్తున్న గోకులమే... మాకులం... ఈ ఆవరణే మా జీవితం అంటున్నారు విద్యార్థులు.

అన్నీ వారై

విశాలమైన తరగతి గదులతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూనే మిగతా సమయమంతా విద్యార్థులతోనే గడుపుతారు.

ఏడుస్తూ పుడతాం... ఏడుస్తూ పోతాం... బతికినన్ని నాళ్లైనా పదిమందికి బతికే దారిని చూపిస్తే కలకాలం వారి గుండెల్లో బతికుండిపోతాం... అనుకుంటూ చేతనైన సాయంతో చీకటి నిండిన జీవితాల్లో వెలుగులు నింపుతోంది బాలగోకులం.

ఇదీ చూడండి: 'హరితహారాన్ని విజయవంతం చేద్దాం... పచ్చదనంతో నింపేద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.