కొత్త సైకిల్ మోజు.. ఓ బాలుడి ప్రాణం బలిగొంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేవంత్ సైకిల్ పై వెళ్తూ.. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనివ్వడం వల్ల సంతోషంగా ఆడుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామంలో విషాదం
సాయంత్రమైనప్పటికి కొడుకు కనిపించకపోవడం వల్ల తల్లిదండ్రులు బంధువుల ఇళ్లతోపాటు ఊరంతా గాలించారు. అయినా జాడ లభించలేదు. స్థానికుల సమాచారం మేరకు.. ఓ వ్యవసాయ బావిలో వెతకగా మృతదేహంతోపాటు సైకిల్ కనిపించింది. అర్థరాత్రి వరకు నీటిని తోడి మృతదేహం బయటకు తీశారు. సరదాగా ఆడుకునే బాలుడు.. ఇక లేడని తెలియడం వల్ల ఆగ్రామంలో విషాదం అలుముకుంది.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు