బాహుబలి రోటర్..139 మెగావాట్లు - project
కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతి బరువైన పరికరాలను అధికారులు విజయవంతంగా అమర్చారు. 160 టన్నుల మూడో రోటార్‌ను బిగించి ఔరా అనిపించారు.
కాళేశ్వరం
TG_KRN_01_08_KALESHWARAM_BAHUBALI_MOTOR_AV_R20
FROM:MD.Aleemuddin,karimnagar
Note:దీనికి సంబంధించిన వీడియో desk whatsappకు పంపించాను
-----
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. వానాకాలం నాటికి గోదావరి జలాలను వరదకాలువలోకి ఎత్తిపోసేందుకు పనులను వేగిరం చేశారు. ఎనిమిదో ప్యాకేజీలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో మొత్తం ఏడు పంపులు బిగిన్చాల్సి ఉండగా ఇప్పటికే 1, 2, 4, 5 నంబర్ల పంపులను బిగించి డ్రైరన్ నిర్వహించారు. మెయిల్ కంపెనీ గుత్తేదారులు, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు గురువారం 139 మెగావాట్ల సామర్థ్యం గల మూడో పంపు స్టేటర్, రోటర్‌ను బిగించారు. స్టేటర్ బరువు 220 టన్నులు, రోటర్ బరువు 160 టన్నులు ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం ప్రాజెక్టు పరిధిలోనే అతిబరువైన పరికరాలను విజయవంతంగా అమర్చారు. మరో 15 రోజుల్లో గురువారం బిగించిన మూడో పంపు డ్రైరన్ నిర్వహించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.