MLC Elections 2021: రాష్ట్రంలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మంత్రి గంగుల ఆగ్రహం
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవటంపై మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కండువాలు వేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్‌పై విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధులతో కలిసి క్యాంపు నుంచి నేరుగా జిల్లా పరిషత్‌లోకి వచ్చిన మంత్రి.. కండువా కప్పుకొని ఉండటంపై రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కండువాలపై పార్టీ గుర్తులు లేవని ఎవరో ఫిర్యాదు చేస్తే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుల ఆందోళన
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. తెరాస నేతలు పోలింగ్ కేంద్రంలో తిరుగుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:
MLC Elections Voting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు