ETV Bharat / state

తెలంగాణ పోలీసు శిక్షణ కేంద్రాలకు అవార్డులు - కరీంనగర్​ జిల్లా వార్తలు

పోలీస్ శిక్షణలో రాష్ట్ర కళాశాలలు దేశీయ స్థాయిలో సత్తాచాటుతున్నాయి. ఉత్తమ శిక్షణ, మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పనలో మంచి పేరు గడిస్తున్నాయి. అత్యుత్తమ శిక్షణతో పాటు... అన్ని రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తున్నందుకు కేంద్ర హోంశాఖ ట్రోఫీకి ఎంపికయ్యాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్ పోలీసు శిక్షణ కేంద్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించాయి.

Telangana Police Training Centers got awards from central home ministry
రాష్ట్రంలోని పోలీసు శిక్షణ కేంద్రాలకు అవార్డులు
author img

By

Published : Feb 4, 2021, 9:20 AM IST

రాష్ట్రంలోని పోలీసు శిక్షణ కేంద్రాలకు అవార్డులు

ఉత్తమ శిక్షణ, మెరుగైన సౌకర్యాల కల్పనతో రాష్ట్రంలోని పోలీసు శిక్షణ కేంద్రాల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తోంది. రాష్ట్రంలోని కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్​ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లు... ప్రథమ స్థానంలో నిలిచాయి. 2018-19 సంవత్సరానికి గానూ కరీంనగర్‌ పీటీసీ ఎంపిక కాగా.... 2019-20 ఏడాదికి హైదరాబాద్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా ట్రోఫీ అందుకున్నాయి. వరంగల్ పట్టణ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలకు భారత దక్షణ మండలంలో 2017-18కి గాను ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా అవార్డును దక్కించుకుంది.

హైదరాబాద్ సీపీ అభినందనలు

2019-20 సంవత్సరానికి దేశంలోనే ఉత్తమ పోలీస్ ట్రైనింగ్‌ సెంటర్‌గా... హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఎంపిక అయింది. 2019-2020 సంవత్సరానికిగాను ట్రోఫీని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పాత బస్తీ పేట్లబురుజులోని ట్రైనింగ్ సెంటర్ ట్రోఫీకి ఎంపిక కావడంతో సిబ్బందిని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అభినందించారు. ఈ శిక్షణ కేంద్రానికి శాంతి భద్రతల అదనపు సీపీ ఎల్​ఎస్​ చౌహాన్‌ ఇంఛార్జ్‌గా ఉన్నారు. వివిధ విభాగాల్లో వందలాది పోలీసులు పీటీసీలో శిక్షణ పొందారని... ఇందుకు కారణం అక్కడి సిబ్బంది అత్యుత్తమ సేవలేనని ఆయన కొనియాడారు. ట్రోఫీతో పాటు 2లక్షల రూపాయలను కేంద్ర హోం శాఖ ప్రకటించనట్లు వెల్లడించారు. అనంతరం సిబ్బందిని ఆయన సత్కరించారు.

ఇండోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణ

పదేళ్ల క్రితం ప్రారంభమైన కరీంనగర్ పోలీస్ శిక్షణా కళాశాల మారుతున్న కాలంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకొని సిబ్బందిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇండోర్‌, అవుట్‌డోర్‌ శిక్షణ నిర్వహణలో అన్నివిభాగాలను సాధించిన ఫలితాలను పరిగణలోకి తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లోని 36 కళాశాలల్లో ఉత్తమ శిక్షణ కళాశాలగా ఎంపికైంది. ఇండోర్‌ విభాగంలో 10 క్లాస్‌రూములు, కంప్యూటర్ ల్యాబ్‌, యుద్ధతంత్ర శిక్షణ సదుపాయాలు క్రీడల్లో వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, పుట్‌‌బాల్‌ ఇతర క్రీడలకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు బ్యాచులలో 921 మందికి శిక్షణ ఇచ్చారు. అధికారులు విధి నిర్వహణలో సిబ్బంది అంకిత భావం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు పొందగలిగామని ప్రిన్సిపల్ సునీత మోహన్ తెలిపారు. సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.

మామునూరు పీటీసీకి అరుదైన గౌరవం

వరంగల్ పట్టణ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలకు భారత దక్షణ మండలంలో 2017-18కి గాను ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా అవార్డును దక్కించుకుంది. దక్షిణ భారతదేశంలో ఆన్ రికార్డు ట్రైనీస్ విభాగంలో కేంద్ర రక్షణ శాఖ హోమ్ మినిస్టర్ ట్రోఫీకి ఎంపికైంది. శిక్షణార్థులకు కల్పిస్తున్న వసతులను కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పరిగణలోకి తీసుకుని ఈ అవార్డును అందివనున్నట్లు పీటీసీ ప్రిన్సిపాల్ గంగారాం తెలిపారు. ట్రోఫీతో పాటు 2 లక్షల రూపాయల నగదును అందించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు శిక్షణ కళాశాలల్లో మామునూరు పీటీసీకి అరుదైన గౌరవం దక్కిందని గంగారాం అన్నారు. మామునూరు పిటీసీకి అవార్డు ప్రకటనతో పోలీసు శిక్షణ సిబ్బంది డీఎస్పీ గంగారాంకు పులగుచం, స్వీట్లు తినిపించి సంబరాలు జరుపుకున్నారు.

పోలీస్​ శిక్షణే కాదు...

పోలీస్ విధుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తూనే మరోవైపు వాతావరణ కాలుష్యం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా చెరువును తవ్వించడంతో పాటు అందులో చేపలను పెంచుతున్నారు. అంతేకాకుండా కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసి శిక్షణ కళాశాలకు కావల్సిన కూరగాయలను అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు విధి నిర్వహణలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తుండటం వల్ల తమకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని శిక్షణ పొందుతున్న వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా హరితహారంలో భాగంగా మియావాకి అడవుల పెంపకంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందిన కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ తాజాగా జాతీయస్థాయి గుర్తింపు సాధించడం పట్ల పోలీసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఇదీ చదవండి: పేటీఎం నుంచి డబ్బులు చెల్లించమంటున్నారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.