ETV Bharat / state

Farmers Struggling to Sell Paddy: పంట కొనేదెప్పుడు?.. బాధలు తీరేదెన్నడు?

Farmers Struggling to Sell Paddy: యాసంగిలో వరిపంట ఏమిటో కాని ఇప్పుడు వానాకాలం పంట అమ్ముకోవడానికి నానాతంటాలు పడాల్సి వస్తోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తెచ్చిన పంటలు కొనడానికి నానా కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ తగ్గాలని అధికారులు చెబుతుంటే ప్రతిరోజు రాత్రిళ్లు వర్షం పడి వారాల కొద్ది యార్డుల్లోనే కుప్పల వద్ద కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే పరిస్థితి ఇంత అధ్వాహ్నంగా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈనెల 5వ తేదీన కొత్తపల్లి,దుర్శేడుగ్రామాల్లో మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా.. కొనుగోళ్లు మాత్రం ఇంకా వేగవంతం కాలేదని రైతులు వాపోతున్నారు.

Farmers Struggling to Sell Paddy: పంట కొనేదెప్పుడు?.. బాధలు తీరేదెన్నడు?
Farmers Struggling to Sell Paddy: పంట కొనేదెప్పుడు?.. బాధలు తీరేదెన్నడు?
author img

By

Published : Nov 26, 2021, 4:31 PM IST

Farmers Struggling to Sell Paddy: పంట కొనేదెప్పుడు?.. బాధలు తీరేదెన్నడు?

Farmers Struggling to Sell Paddy: వానాకాలం పంట కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు కేంద్రాలు(paddy purchase centers) ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వారాల కొద్ది ధాన్యం రాశుల వద్దనే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఉంటోందని వాపోతున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఈనెల 5వ తేదీన కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల మంత్రి గంగుల కమలాకర్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడమే కాకుండా యుద్దప్రాతిపదికన కొనుగోలు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో ధాన్యం కొనుగోలుకు ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తం అయ్యింది. అధికారులు ప్రజాప్రతినిధుల ముందు ధాన్యం కొనుగోలు ప్రారంభించినా ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ నత్తతో పోటీ పడుతోంది.

అన్నదాతల ఆవేదన

అకాల వర్షం కారణంగా అనేక సార్లు ధాన్యం తడుస్తున్నా కనీసం కాపాడుకోలేక పోతున్నామని అన్నదాతలు(farmers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయలేక పోయినా కనీసం టార్పాలిన్లు సరఫరా చేసినా బాగుండేదని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పలుకుబడి ఉన్న రైతులకు సంబంధించిన ధాన్యం చకచకా కొనుగోలు జరుగుతుండగా.. సాధారణ రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తేమ శాతం వచ్చినా కొంటలేరు

కొన్ని రోజుల క్రితం కుప్పపోసినం. వర్షాలకు ధాన్యం రోజు తడుస్తోంది. ఒక్క పరదా కూడా ఇస్తలేరు. ఎవరూ మమ్మల్ని లెక్క చేస్తలేరు. తేమ శాతం 13, 14 వచ్చినా కొంటలేరు. మా అవస్థలు పట్టించుకున్న నాథుడు లేదు. పంట పండించేందుకు ఎన్నో ఖర్చులు పెడుతున్నాం. -రాధ, రైతు, గోపాలరావుపేట, కరీంనగర్‌ జిల్లా

అవస్థలు పడుతున్నాం..

ప్రతిరోజు ధాన్యం ఆరబోస్తున్నాం. మళ్లీ కుప్పపోస్తున్నాం. 15రోజుల నుంచి ధాన్యం కుప్పల వద్దే ఉంటున్నాం. వర్షాలు పడటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. తేమ శాతం వచ్చినా ధాన్యం ఎత్తట్లేరు. అవస్థలు పడుతున్నాం. -అయిలయ్య, రైతు, గోపాలరావుపేట,కరీంనగర్ జిల్లా

ఆచరణలో వెనుకంజ

పొగమంచు, వర్షాల వల్ల ధాన్యం తేమ రావడం లేదని, ఫలితంగా కొనుగోలు జరపడం లేదు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సివస్తోందని రైతులు వాపోతున్నారు. ఒక్కో బస్తాకు 2నుంచి 5కిలోల తరుగు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతీ గింజను కొంటామని అధికారులు చెబుతున్నా...ఆచరణలో మాత్రం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు

ఎన్నో ఖర్చులు పెట్టాం

పరదాల కిరాయి, ట్రాక్టర్​ కిరాయిలు ఇలా ఎన్నో ఖర్చులు పెట్టాం. చాలా రోజుల నుంచి ఎన్నో అవస్థలు పడ్డాం. తొందరగా ధాన్యాన్ని కొనాలి. మాకు వ్యవసాయమే జీవనాధారం. -పడాల లక్ష్మి, రైతు, కరీంనగర్ జిల్లా

వేగవంతం చేయండి..

ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతుల గోడు చూసైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. లేదంటే పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు భారంగా మారాయని వాపోతున్నారు.

ఇదీ చదవండి:

Jagtial Farmers Protest today : ధాన్యం కొనుగోళ్లకై కదం తొక్కిన జగిత్యాల రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.