పార్టీ సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారని ఆయన తెలిపారు. కరీంనగర్‌లో జరిగిన భాజపా పదాధికారుల భేటీలో బండి సంజయ్ హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని... ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారని విమర్శించారు.
భాజపాపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతున్నారని ఆరోపించారు. మున్ముందు భాజపా శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవని సూచించారు. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
'రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయింది. దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారు. భాజపాపై కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతున్నారు. మున్ముందు భాజపా శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుంది. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉంది. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారు. సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదు.' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి : ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ సీటు?