కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట విద్యార్థి ఐకాస నాయకులు ఆందోళనకు దిగారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని నినదించారు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవీచూడండి: బస్సులోనుంచి దింపేసి మహిళపై అత్యాచారం