కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీపీ వీబీ కమలాసన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్, రాజీవ్ చౌక్, టవర్, సర్కిల్ ఏరియా, విద్యానగర్, రాంనగర్, మంకమ్మ తోట ఏరియాల్లో మోటారు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు.
లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించి రాత్రివేళల్లో రహదారులపై తిరుగుతున్న వారిని పోలీసు వాహనంలో ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అనవసరంగా బయటికి వస్తే సహించేది లేదని నగరవాసులను సీపీ హెచ్చరించారు. తనిఖీలను ప్రతిరోజూ చేపడతామని తెలిపారు. లాక్‌డౌన్ సడలింపు సమయంలో అన్ని పనులు ముగించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Immunity: వ్యాధి నిరోధక శక్తి పేరుతో సరికొత్త మెడికల్ దందా