కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని ఆర్థికమంత్రి హరీశ్‌రావు (Harish Rao Comments) విమర్శించారు. హుజూరాబాద్‌లో జరిగిన ఆశీర్వాద సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్న హరీశ్‌రావు... భాజపా నాయకులపై విమర్శలు గుప్పించారు. ప్రజల వైపు ఉండి వారి కోసం పనిచేసే తెరాస పార్టీకే ఉపఎన్నికలో ఓటు వేయాలన్నారు. భాజపా ప్రభుత్వం... కులవృత్తులనూ కార్పొరేట్ చేతుల్లో పెడుతోందని ఆరోపించారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే పార్టీ భాజపా. పేద ప్రజల ఉసురు పోసుకునే పార్టీ భాజపా. మార్కెట్ యార్డులను రద్దు చేసి ఇవాళ కొత్త చట్టాలను తీసుకొస్తుంది. ఇయ్యాళ కిరాణ దుకాణాలు పోతున్నాయి. కుల వృత్తులు పోతున్నయి. అన్ని కూడా కార్పొరేట్ చేతుల్లోకి పోతున్నయి. మన గురించి ఆలోచించే పార్టీ పక్షానా మనముందామా? మన వృత్తులను ఆగం చేసి బడాబడా పారిశ్రామిక వేత్తల చేతుల్లో పెట్టి మనల్ని అందులో కూలీలను చేసే భాజపాకు మనం మద్దతు ఇయ్యాల్నా? దయచేసి ఆలోచించాలని కోరుతున్నా.
-- హరీశ్‌రావు, మంత్రి
ఇదీ చదవండి: