ETV Bharat / state

ఘనంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకలు

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నంలోని మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణ మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఘనంగా శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకలు
Sri Matsyagirindra Swami Kalyanam celebrations in kothagattu karimnagar
author img

By

Published : Feb 24, 2021, 1:28 AM IST

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణ వేడుక కన్నులపండువగా జరిగింది. ప్రభుత్వం తరఫున స్వామి వారికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుడా ఛైర్మన్‌ జి.వి. రామక్రిష్ణారావుతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు.

భూ దేవీ, నీళా దేవీతో శ్రీ మత్స్యగీరీంద్ర స్వామి వారిని పల్లకిపై ఆలయ ఆవరణలోని కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ.. కల్యాణం వైభవోపేతంగా జరిగింది. గుట్టపై స్వామివారు బంగారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు, సీఐలు వాసంశెట్టి మాధవి, ఎర్రల కిరణ్‌ పాల్గొన్నారు.

శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి కల్యాణ వేడుకలు

ఇదీ చదవండి: తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.