కరీంనగర్ జిల్లాలో కొవిడ్ చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో సదుపాయాలతోపాటు ఔషధాల వినియోగంపై తనిఖీ చేసి కలెక్టర్‌కు రోజూ నివేదిక ఇస్తున్నామని డ్రగ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బెడ్స్ కొరత, కొవిడ్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సహా ఇతర సౌకర్యలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు తీసుకన్న వారి వివరాలు సేకరించి.. వారికి ఫోన్ చేసి ఇంజక్షన్ తీసుకున్నారో లేదో తెలుసుకుంటున్నట్లు చెప్పారు. మిగతా రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల వివరాలను రోజూ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ రోజు వివరాలు ఆ రోజు సేకరించడం ద్వారా కరోనా రోగులకు సులభంగా సౌకర్యాలు అందుతున్నాయని ఆయన వివరించారు.
ఇదీ చూడండి : హైదరాబాద్ పరిధిలో లక్ష మందికి ఫైన్: సజ్జనార్