రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపాను గెలిపించుకునేందుకు ఇప్పటినుంచే కృషి చేయాలని కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లెలో భాజపా కార్యకర్తలతో సమావేశమయ్యారు. అభిప్రాయ భేదాలను మరచి పార్టీ అభ్యర్థుల విజయం కోసం పోరాడాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు మద్దతు పలికినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపి, స్థానిక ఎన్నికల్లో కూడా ఆదరించే దిశగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సంజయ్ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్