రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3వేల కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ కరీంనగర్లో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మాట కంచు.. మనసు మంచు.. ఆయనే మోహన్‌బాబు