వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ శిశువు మృతి చెందాడంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌కు చెందిన సంధ్యకు పురిటినొప్పులు రావటం వల్ల బుధవారం ఆసుపత్రికి తరలించినట్లు సంధ్య బంధువులు తెలిపారు. గురువారం ఉదయం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు పేర్కొన్నారన్నారు. రాత్రి 7గంటలకు ఆపరేషన్ చేసేందుకు థియేటర్‌లోకి తీసుకెళ్లారని, పదిహేను నిమిషాల వ్యవధిలోనే మృతి చెందిన మగ శిశువును చేతిలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు బైఠాయించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందాడని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రవీణ్‌రెడ్డి చెబుతున్నారు.
ఇవీ చూడండి: ‘దినార్’ వేటలో దీనగాథలు.. ఉపాధి కోసం వెళ్తే కాటేసిన కరోనా