Nakshatra vanam in karimnagar : కరీంనగర్ నగరంలోని బైపాస్ రోడ్డులో ఉన్న డ్యామ్ వద్ద ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆవరణలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. మొత్తం పది ఎకరాల స్థలం ఉండగా.. 30 వేల మొక్కలను నాటేలా కార్యాచరణ తీసుకున్నారు. ఇక్కడే రూ.6.70 లక్షలతో 10 మీటర్ల చుట్టూ ప్రత్యేకంగా 'రాశివనం' పేరుతో గుండ్రంగా నిర్మించారు. 12 రాశుల ప్రకారం ఒక్కో రాశికి మూడు మొక్కల చొప్పున 36 మొక్కలు నాటించారు. అంతేకాకుండా 1800 పూల మొక్కలు పెట్టించారు. దీనితో ఈ ప్రాంతం ప్రజలను మరింత ఆకర్షిస్తోంది. నగర పాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీల్లో పలు రకాల మొక్కలు నాటుతుండగా.. వచ్చే ఏడాది వర్షాకాలంలో రాశుల మొక్కలు నాటి ఇంటింటా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాశుల ప్రకారం మొక్కలు ప్రైవేట్ నర్సరీల్లో దొరుకుతున్నట్లుగా సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు.
Karimnagar Rashi Vanam : రాశి ప్రకారం మొక్కను ఇంటి ఆవరణలో నాటడమే కాకుండా.. వాటికి నీరు పోసి పెంచితే ఎన్నో శుభాలు కలుగుతాయని స్థానిక పండితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ చెబుతున్నారు. ఒక్కో రాశి, గ్రహం ప్రకారం ఏ మొక్క పెంచుకుంటే బాగుంటుందో వివరిస్తున్నారు. ఈ మేరకు తమకు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు చక్కటి అవకాశాన్ని కల్పించారని ఆయన కొనియాడారు. ఆ చెట్ల పట్ల సంబంధిత రాశుల వారికి మమకారం పెరుగుతుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో రాశి ప్రకారం మొక్కలను పెంచితే.. వాతావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
ప్రజలకు ఇష్టమైన మొక్కలు పెంచి రక్షించడం ద్వారా నగర వీధుల్లో పచ్చదనం పెంచాలన్నదే తమ అభిమతమని మేయర్ సునీల్‌రావు తెలిపారు. ముందస్తుగా అవగాహన కోసం రాశుల ప్రకారం రాశివనంలో మొక్కలు నాటామని స్పష్టం చేశారు. వీటిని చూసి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను ప్రతి ఇంట్లో పెంచుకుంటారని తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. అంతేకాకుండా వచ్చే ఏడాది నుంచి ఎవరి జన్మ నక్షత్రం ప్రకారం వారికి మొక్కలు అందిస్తామని మేయర్ వివరించారు.
ప్రజలకు ఇష్టమైన మొక్కలు పెంచి రక్షించడం ద్వారా నగర వీధుల్లో పచ్చదనం పెరుగుతుంది. ముందస్తుగా అవగాహన కోసం రాశుల ప్రకారం మొక్కలు నాటాం. ఈ మొక్కలను ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. వచ్చే ఏడాది నుంచి ఎవరి జన్మ నక్షత్రం ప్రకారం వారికి మొక్కలు అందిస్తాం. నగరంలో పచ్చదనం పెంచాలన్నదే మా లక్ష్యం. - సునీల్ రావు, కరీంనగర్ మేయర్
ఇవీ చూడండి..
Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం
Telangana Harithosthavam 2023 : 'ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం'