ETV Bharat / state

రంజాన్​ దృష్ట్యా పెరుగుతున్న గిరాకీ

భక్తి శ్రద్ధలతో చేపట్టిన ఉపవాస దీక్షలు చరమాంకానికి చేరాయి. ఈదుల్ ఫితర్‌ జరుపుకోవడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత మూడు వారాలుగా ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా మార్కెట్‌ వైపు వెళ్లేందుకు ముస్లింలు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. ఇప్పుడిప్పుడే వినియోగదారులు షాపింగ్‌వైపు దృష్టిని సారిస్తున్నారు.

author img

By

Published : Jun 4, 2019, 4:45 AM IST

Updated : Jun 4, 2019, 7:00 AM IST

రంజాన్​ దృష్ట్యా పెరుగుతున్న వ్యాపారం
రంజాన్​ దృష్ట్యా పెరుగుతున్న వ్యాపారం

ముస్లింలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే రంజాన్ పండుగకు సంబంధించిన మార్కెట్‌ కొనుగోలు అమ్మకాల కోసం సిద్ధమైంది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలకు ఈసారి ఎండ తీవ్రత ఉష్ణోగ్రత కఠిన పరీక్షనే పెట్టిందని చెప్పాలి. ప్రతి సంవత్సరం రంజాన్‌ మూడవ వారం నుంచే మార్కెట్‌లో కొనుగోలు అమ్మకాలతో కళకళలాడేది.. కానీ ఈసారి ఈ ఎండల కారణంగా కొనుగోళ్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదని వ్యాపారులు చెబుతున్నారు.

నెలరోజుల పాటు కఠినంగా ఉపవాసాలు దీక్షలు చేపట్టిన ముస్లింలు అత్యంత శ్రద్ధతో పండగ రోజు ప్రత్యేకంగా షీర్‌ఖుర్మాతో పాటు ఘుమఘుమలాడే వంటకాలు చేపడతారు. ప్రధానంగా ఇందులో డ్రైఫ్రూట్స్‌ ఎక్కువగా వినియోగిస్తారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న రకరకాల ఖర్జూర పళ్లతో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు, సేమియాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

రంజాన్ పండగ సందర్భంగా కొత్త బట్టలతో పాటు సుగంధ ద్రవ్యాలను వినియోగించడం ఆనవాయితీ..అందుకుగాను రకరకాల అత్తర్లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పండగ రోజు తలకు ధరించే టోపీలు, రుమాల్లు, కళ్లకు పెట్టుకొనే సుర్మాతో పాటు ప్రత్యేకమైన కాటుకలు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్తర్లు అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

మరో రెండు మూడు రోజుల్లో రంజాన్‌ పండుగకు సంబంధించిన కొనుగోళ్లు అమ్మకాలు పూర్తి అవుతాయి. లాభం గురించి పెద్దగా పట్టింపులకు వెళ్లకుండా సరసమైన ధరలకే అమ్ముతున్నామంటూ వ్యాపారులు కొనుగోలుదారులను ఆకట్టుకొనేందుకు యత్నిస్తున్నారు.

ఇవీ చూడండి: పరిషత్ అధ్యక్షుల ఎన్నిక సమన్వయానికి తెరాస ఇంఛార్జీలు

sample description
Last Updated : Jun 4, 2019, 7:00 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.