గోదావరి నదీ జలాలకు కేంద్రబిందువుగా ఉన్నా... 8 గ్రామాలకు సాగునీటి వసతి లేక కరీంనగర్ జిల్లా రామడుగు మండల రైతులు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సముద్రమట్టానికి 321 మీటర్ల ఎత్తులో వ్యవసాయ భూములు ఉన్నందున ఎత్తిపోతల పథకం నుంచి కూడా లబ్ధి చేకూరడం లేదు. ఇటీవలే ప్రభుత్వం నాలుగు తూముల కోసం రూ. 270 కోట్లు మంజూరు చేసినా ఎత్తు సమస్య వల్ల నిరుపయోగంగా మారాయి. ఐదేళ్ల క్రితం నిర్మించిన డీ1 కాలువకు ఎస్సారెస్పీ వరద కాలువపై వంతెన నిర్మిస్తే 8 గ్రామాల్లో వేలాది ఎకరాలకు సాగు నీరు అందనుంది. దీనిపై పాలకులు సత్వరం స్పందించాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: '2 లక్షల 25 వేల కోట్ల నిధులు పక్కదారి'