Telangana Rains: రాష్ట్రంలో చలికి గజగజ వణుకుతున్న ప్రజలను.. గత రెండు రోజులుగా వరుణుడు వానజల్లులతో పలకరిస్తున్నాడు. నేడు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో మోస్తరు వర్షం పడింది.
రాత్రికి పలు జిల్లాల్లో వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
Telangana Rains Today: రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఆర్మూర్, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఆదివారం వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో వాన పడింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్యాల, బుగ్గారం, ధర్మపురి, చందుర్తి, రుద్రంగి మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. సిద్దిపేట పట్టణంలోనూ గత రాత్రి మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు తడిసి ముద్దయ్యాయి. రోడ్లమీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇదీ చదవండి: వైద్య సిబ్బంది 'టీకా' సాహసం- భారీ హిమపాతంలోనూ విధులకు...