ETV Bharat / state

త్వరలో కాళేశ్వరంపై సుప్రీంలో భాజపా పిటిషన్ - మంత్రులు

భాజపాపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్​రావు ఘాటుగా తిప్పికొట్టారు. తమపై అవాకులు చవాకులు పేలారనీ... రైతులు నిలదీస్తే మాత్రం కనీసం సమాధానం చెప్పలేకపోయాడని మంత్రి ఎర్రబెల్లిని ఎద్దేవా చేశారు.

RAGHUNANADAN_FIRE_ON_MINISTER ERRABELLI
author img

By

Published : Sep 14, 2019, 7:11 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న భాజాపా.. త్వరలో దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో కేసు దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కరీంనగర్‌‌లో వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలకు 2004, 2009, 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా ఆదాయపు లెక్కలు అడుగుతూ నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. భాజపా ఎంపీలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ చేసిన విమర్శలపై తీవ్రంగా మండిపడ్డారు. తెరాసలో చేరక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని సూచించారు. వెల్గటూరులో తమ పార్టీపై అవాకులు చవాకులు పేలిన ఎర్రబెల్లి... కొడిమ్యాలలో రైతులు నిలదీస్తే సమాధానం చెప్పలేకపోయాడని ఎద్దేవా చేశారు.

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై రఘనందన్​రావు ఘాటు స్పందన

ఇదీ చూడండి: శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.