గీత కార్మికులకు వాహనాలు ఇవ్వకపోగా, బడ్జెట్లో రూ.25 కోట్లు మాత్రమే కేటాయించడంపై సర్వాయి పాపన్న మోకుదెబ్బ ఇళ్లందకుంట మండల యూత్ ప్రధాన కార్యదర్శి తోడేటి రాకేశ్ గౌడ్ స్పందించారు. తమ వృత్తి సంక్షేమాభివృద్ధికి నిధులు తగ్గించడాన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంటలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గీతకార్మికుల సంక్షేమం పట్ల పక్షపాత ధోరణి అవలంభింస్తోందని రాకేశ్ గౌడ్ ఆరోపించారు. బడ్జెట్లో కేటాయింపులపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ పథకాల అమలుతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: అత్యాచార నిందితున్ని తక్షణమే శిక్షించాలి: ఏబీవీపీ