ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా దేశంలో పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు విధిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుంద రెడ్డి అన్నారు. ధరలు దారుణంగా పెరగడం వల్ల ప్రజలు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారన్నారు. పన్నులు తగ్గించాలని.. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగి.. ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దారి తీస్తుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని స్పష్టం చేశారు. కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్, నాయకులు సీహెచ్ భద్రయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దృష్టి మళ్లించి మోసం చేసే అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్