ETV Bharat / state

Ramagundam NTPC Power generation : ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.. ఉత్పత్తి మరిచారు..! - రామగుండం ఎన్టీపీసీలో పవర్​ ఉత్పత్తి

Ramagundam NTPC construction works : రాష్ట్ర విభజన చట్టానికి లోబడి అవసరానికి అనుగుణంగా ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రణాళిక ఉన్నా అమల్లో మాత్రం జాప్యం జరుగుతోంది. రెండు దశల్లో ఎన్టీపీసీ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా తొలి విడతలో పూర్తి అయినప్పటికి విద్యుత్ సరఫరా మాత్రం జరగడం లేదు. పర్యవసానంగా ఎన్టీపీసీ ద్వారా కేవలం 5రూపాయలకు యునిట్ చొప్పున కొనాల్సిన ఉండగా అందుబాటులో లేకపోవడంతో 12రూపాయలకు యునిట్ చొప్పున బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి విడతలో నిర్మాణం పూర్తి అయిన ఎన్టీపీసీలో ఏప్రిల్‌ మాసంలో ప్రయోగాత్మకంగా ఉత్పత్తిని ప్రారంభించి విజయవంతంగా ప్రారంభమైందని సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఎందుకు ఉత్పత్తి నిలిచిపోయిందో తెలియని పరిస్థితి నెలకొంది.

Ramagundam NTPC
Ramagundam NTPC
author img

By

Published : Jun 13, 2023, 3:45 PM IST

Power Problems on Ramagundam NTPC : రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేకంగా రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన కొత్త విద్యుత్‌ కేంద్రంలో వాణిజ్య ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమౌతుందనే అంశం ప్రశ్నార్ధకంగా మారింది. ఈ జాప్యం కారణంగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు తీవ్ర ఆర్థిక భారం పడుతోందని రాష్ట్ర ప్రభుత్వ తాజా అంచనా. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో విద్యుత్‌ కొరత తీర్చడానికి 4 వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్త విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తామని కేంద్రం తెలిపింది.

ఈ మేరకు రామగుండంలో అప్పటికే ఉన్న పాత విద్యుత్‌ కేంద్రం పక్కనున్న 500 ఎకరాల్లో తొలిదశ కింద రూ.10వేల 598 కోట్ల వ్యయంతో 1600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. ఒక్కో ప్లాంటు విద్యుదుత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. 2016 ఆగస్టు 7న శంకుస్థాపన చేసింది. నిబంధనల ప్రకారం 2020 ఫిబ్రవరికల్లా రామగుండం కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావాలి. కరోనా కారణంగా నిర్మాణపు పనుల్లో జాప్యం చోటు చేసుకొంది. దాదాపు రెండేళ్ల ఆలస్యంగా నిర్మాణం పూర్తి చేసినా ఇప్పటికీ విద్యుదుత్పత్తి జాడ లేకుండా పోయింది.

గత ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా మొదటి ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించినా హీటర్‌ ట్యూబ్‌లో లీకేజీలతో కొద్దిరోజులకే ఆపేశారు. ఈ ట్యూబుల మరమ్మతుల్లో జాప్యం జరిగిందని తెలుస్తోంది. ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి మొదటి ప్లాంటును ఎందుకు నిలిపివేశారనేది ఎన్టీపీసీ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల మొదటి ప్లాంటు మరమ్మతు పూర్తయినట్లు ఎన్టీపీసీ వర్గాలు చెబుతుండగా.. మరో ప్లాంటు ఇంకా ఉత్పత్తికి సిద్ధం కాలేదని ఎన్టీపీసీ చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. అయితే డిమాండ్ లేని రోజుల్లో రాష్ట్రానికి పెద్దగా నష్టం లేకపోయినా ఇటీవల రోజువారీ గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 28.30 కోట్ల యూనిట్లకు చేరడంతో ఆర్ధిక భారం డిస్కంలకు పెరుగుతోంది.

Ramagundam NTPC Thermal Power Station : ప్రస్తుతం రోజూ 20 కోట్ల యూనిట్ల డిమాండ్ ఉంటుండటంతో రోజూ ఇంధన ఎక్స్ఛేంజీలో యూనిట్‌కు గరిష్ఠంగా రూ.12 దాకా చెల్లించి డిస్కంలు కరెంటు కొంటున్నాయి. ఎన్టీపీసీ ప్లాంటు విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే యూనిట్‌ రూ.5లోపే ధరకు రోజుకు 2 కోట్ల యూనిట్లకు పైగా కరెంటు రాష్ట్రానికి అందుబాటులో ఉండేది. ఈ కేంద్రంలో ఉత్పత్తి జాప్యం కారణంగా ఇప్పటికే రాష్ట్ర డిస్కంలు రూ.వెయ్యి కోట్లకు పైగా అదనంగా వెచ్చించి బయటి మార్కెట్‌లో కరెంటు కొనాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్తోంది. జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరగనుంది.

ఇలా పెరిగే వ్యయం మొత్తాన్ని పీపీఏ నిబంధనల ప్రకారం అక్కడ ఉత్పత్తయ్యే కరెంటు విక్రయ ధరలో కలిపి డిస్కంల నుంచే ఎన్టీపీసీ వసూలు చేస్తుంది. ఈ సొమ్మును అంతిమంగా సామాన్య ప్రజలే కరెంటు బిల్లుల రూపంలో భవిష్యత్తులో భరించడం అనివార్యంగా మారనుంది. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే కరెంటును కొంటామని రాష్ట్ర డిస్కంలు 2016 జనవరి 16న ఎన్టీపీసీతో ‘విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం’ (పీపీఏ) చేసుకున్నాయి. కానీ ఇంతవరకూ కరెంటు రాకపోవడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.

ఈ ప్లాంటు నిర్మాణం త్వరగా పూర్తిచేసి కరెంటు సరఫరా చేయాలని కూడా ఎన్టీపీసీని కోరినట్లు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలు మే నేలతో ముగిసిపోతాయని ఆతర్వాత కమర్షియల్‌ ఆపరేషన్ డిక్లరేషన్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తికి మొదటి ప్లాంట్ సిద్దంగా ఉన్న సీఓడీ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎన్టీపీసీ అధికారులు ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.