ETV Bharat / state

Problems in Hospital: మాతా-శిశు కేంద్రంలో వార్మర్ల కొరత.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్‌ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో(Govt Health Center in karimnagar) వైద్యుల కొరత వేధిస్తోంది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సిబ్బంది లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు తోడూ... శిశువులకు వైద్య సేవలందించే వార్మర్ల కొరత వేధిస్తోంది. ఆసుపత్రి ప్రారంభించినప్పుడు అందించిన వార్మర్లతోనే ఇప్పటికీ సరిపెట్టుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది.

author img

By

Published : Nov 13, 2021, 8:57 PM IST

కరీంనగర్‌ మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలు

కరీంనగర్‌ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో(mother and children Health Center in karimnagar) వైద్యుల కొరత వేధిస్తోంది. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సిబ్బంది లేక వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు తోడూ... శిశువులకు వైద్యసేవలందించే వార్మర్ల కొరత వేధిస్తోంది. ఆసుపత్రి ప్రారంభించినప్పుడు అందించిన వార్మర్లతోనే ఇప్పటికీ సరిపెట్టుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది.

కరీంనగర్ మాతాశిశు ఆరోగ్య కేంద్రం(mother and children Health Center in karimnagar) ఉమ్మడి జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు సైతం వైద్య కేంద్రంగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా కాన్పులకు ఇక్కడికే వస్తుంటారు. ఏడాదిలోపు పిల్లలను వైద్యం కోసం ఇక్కడికే తీసుకు వస్తుంటారు. అయితే అనారోగ్య సమస్యలతో పుట్టిన శిశువులకు వైద్యం అందించే వార్మర్స్‌ కొరత కష్టాలు తెచ్చిపెట్టింది. నెలలు నిండకముందే పుట్టే శిశువులతోపాటు ఉమ్మనీరు మింగిన పసికందులు, ఇన్‌ఫెక్షన్‌, శ్వాస సంబంధ ఇబ్బందులు పడుతున్న శిశువులు, కామెర్లు సోకిన చిన్నారులకు వార్మర్స్‌లో పెట్టి వైద్యం అందిస్తారు. 2012లో ఈ ఆసుపత్రికి 19 వార్మర్లు ఇచ్చిన వైద్యశాఖ.. వైద్యం కోసం వచ్చే శిశువుల సంఖ్య పెరిగినా కొత్తవాటిని ఇవ్వలేదు. వార్మర్లు 24 గంటలపాటు పనిచేయడంతో మరమ్మతులకు గురై ప్రస్తుతం ఆరేడు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో ఒక్కో వార్మర్‌లో ఇద్దరు లేక ముగ్గురు శిశువులను(childrens) ఉంచి వైద్యం అందించాల్సి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు.

మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో (mother and children Health Center in karimnagar)వార్మర్స్‌తోపాటు వైద్యులు, సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఆసుపత్రిలో ఏడుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. ఒకరు బదిలీపై వెళ్లగా.. ఇద్దరు వైద్యులకు శాశ్వత ఉద్యోగం రావడంతో మూడు నెలల కిత్రం వెళ్లారు. ఉన్న నలుగురు వైద్యుల సేవలు సరిపోవడం లేదు. 14 మంది నర్సులు పని చేయాల్సి ఉండగా 10 మంది మాత్రమే ఉన్నారు. పిల్లల వైద్యం కోసం ఔషధాలు లభ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. శ్వాస సంబంధిత వ్యాధితో వచ్చే వారికి ఇచ్చే కాప్రేట్‌ సూదిమందు సరిపడా అందుబాటులో లేదు.

వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (mother and children Health Center in karimnagar)ఇప్పటికే 150 మంది ఇన్‌పేషెంట్లుగా ఉంటున్నారు. ఇక్కడే పుట్టిన పిల్లలతోపాటు ఉమ్మడి, ఇతర జిల్లాల నుంచి చిన్నారులను వైద్యం కోసం తీసుకు వస్తుండటంతో ఈ కేంద్రం సరిపోవడం లేదు. ఇక్కడి అవసరాలు దృష్టిలో పెట్టుకొని మరో మాతాశిశు కేంద్రాన్ని ప్రారంభించాల్సిన అవసరం కన్పిస్తోంది.

ఇదీ చూడండి: వైద్యారోగ్య శాఖలో సరికొత్త మార్పు.. మంత్రి హరీశ్​ కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.