ETV Bharat / sports

బ్రాండ్ ఎండార్స్​మెంట్- ఫస్ట్ అండ్ కాస్ట్లీ డీల్- విరాట్, రోహిత్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే? - Cricketer Brand Endorsement

Cricketer Brand Endorsement : టీమ్ఇండియా క్రికెటర్లలో బ్రాండ్ ఎండార్స్​మెంట్​ డీల్ కుదుర్చుకున్న ప్లేయర్ ఎవరో తెలుసా?

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Cricketer Brand Endorsement
Cricketer Brand Endorsement (Source: IANS, ANI and AFP)

Cricketer Brand Endorsement : భారత్​లో క్రికెట్ ఉండే క్రేజే వేరు. ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్​లు ఏవైనా అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అందుకే ప్రముఖ కంపెనీలు క్రికెటర్లను తమ బ్రాండ్ అంబాసిడర్లగా నియమించేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లలో మొదట బ్రాండ్ ఎండార్స్​మెంట్ డీల్ కుదుర్చుకున్నది ఎవరు? అత్యంత ఖరీదైన డీల్ ఏది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తొలి బ్రాండ్ అంబాసిడర్
టీమ్ఇండియా తొలి కెప్టెన్​గా సీకే నాయుడు భారత క్రికెట్​కు ఎనలేని సేవలు అందించాడు. సీకే నాయుడు 1941లో బాత్‌ గేట్ లివర్ టానిక్ అనే బ్రాండ్​కు అంబాసిడర్​గా ఉన్నాడు. దీంతో ఓ బ్రాండ్​కు అంబాసిడర్​గా నిలిచిన తొలి వ్యక్తిగా సీకే నాయుడు నిలిచాడు. ఈ ఎండార్స్​మెంట్ డీల్ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగింది.

అత్యంత ఖరీదైన డీల్
భారత దిగ్గజాలు సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ బ్రాండ్ ఎండార్స్‌ మెంట్‌ ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించేవారు. ఈ తరం క్రికెటర్లు కూడా బ్రాండ్ ఎండార్స్​మెంట్ ద్వారా భారీ మొత్తంలో అర్జిస్తున్నారు. అందులో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. వికాట్ బ్రాండ్ ఎండార్స్​మెంట్​లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు. విరాట్ కోహ్లీ 2017లో ప్యూమా (PUMA) కంపెనీతో రూ.110 కోట్ల ఎండార్స్​మెంట్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇదే భారత క్రికెటర్లు కుదుర్చుకున్న అత్యంత ఖరీదైన డీల్. అలాగే ఎంఆర్ఎఫ్​ (MRF)తో 8 ఏళ్లకు రూ.100 కోట్ల ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే ఏడాదికి సగటున రూ.12.5 కోట్లన్నమాట.

రోహిత్, ధోనీ సైతం
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టైర్ బ్రాండ్ సియట్‌ (CEAT)తో ఏడాదికి రూ. 3 కోట్లతో ఒప్పందం చేసుకున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆస్ట్రేలియాకు చెందిన స్పార్టన్ స్పోర్ట్స్ అనే బ్రాండ్‌తో స్పాన్సర్‌ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ ద్వారా ధోనీ ఏటా రూ. 25 కోట్లను సంపాదించాడు. అంతకుముందు, యువరాజ్ సింగ్ స్పోర్ట్స్ అపెరల్ బ్రాండ్ ప్యూమాతో రూ.4.5 కోట్ల రూపాయల వార్షిక వేతనంతో స్పాన్సర్‌ షిప్ డీల్ చేసుకున్నాడు. కాగా, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌ క్రిస్ట్ తన బ్యాట్‌పై ట్రావెలెక్స్ అనే విదేశీ కరెన్సీ మార్పిడి సంస్థ లోగో వేసుకోవడానికి డీల్ కుదుర్చుకున్న మొదటి అంతర్జాతీయ ప్లేయర్.

మొహంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ - ఈ ఫొటో మెసేజ్​ ఏంటంటే?

Virat Kohli Social Media Income : ఇన్​స్టా సంపాదనపై కోహ్లీ క్లారిటీ.. 'అదంతా ఫేక్​' అంటూ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.