రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కరీంనగర్ కలెక్టర్ కె.శశాంక తెలిపారు. ఈ పురపాలికల పరిధిలో 146 వార్డులకు 493 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల బరిలో 751 మంది అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. మున్సిపాలిటీల్లో 131 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించామన్నారు.
2,751 మంది సిబ్బంది
మున్సిపల్ ఎన్నికలకు 120 బస్సులు వాడుతున్నామని, 592 మంది ప్రిసైడింగ్ అధికారులు, 592 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 1,795 మంది ఇతర పోలీస్ అధికారులు మొత్తం 2,751 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ చేయిస్తున్నామని చెప్పారు. 492 మందిని బైండోవర్ చేశామని, 15 మందిని జైలుకు పంపామన్నారు. పోలీస్ కేంద్రాల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ స్టేషన్‌కు వంద మీటర్ల పరిధిలో ఎవరిని అనుమతించబోమని చెప్పారు.
ఇవీ చూడండి: జాతి వైరం మరిచే... స్నేహానికి నిదర్శనంగా నిలిచే!