అధికారుల అలసత్వం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. కరీంనగర్ జిల్లా మున్సిపాలిటీలోని కొత్తపెళ్లి చెరువు ప్రాంతంలో యథేచ్ఛగా కట్టడాలు నిర్మిస్తున్నారు.
ఎఫ్టీఎల్ పుల్ట్యాంక్ లెవల్లో నిర్మాణాలు చేపట్టోద్దని ప్రభుత్వ జీవో ఉన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలన చేస్తున్నామని చెప్పారు. కానీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ముగింపు ప్రాంతాలలో ఈ కట్టడాలకు అనుమతులు సైతం ఇచ్చారు.
ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు