ETV Bharat / state

మానవత్వం చాటుకున్న పోలీసులు - కరీంనగర్​ జిల్లా వార్తలు

గన్నేరువరంలో అకాల వర్షాలతో రోడ్లు స్తంభించి పోగా... 108 రాలేని పరిస్థితుల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను పోలీసులు చేరదీసి మానవత్వం చాటారు. పోలీసుల సేవలను ప్రజలు అభినందించారు.

police helped to pregnant lady in karimnagar district
మానవత్వం చాటుకున్న పోలీసులు
author img

By

Published : Aug 15, 2020, 8:28 PM IST

కరీంనగర్​ జిల్లా గన్నేరువరం మండలకేంద్రానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించగా... నిర్విరామంగా కురుస్తున్న వర్షం కారణంగా వరద నీటి ఉద్ధృతికి రోడ్లు స్తంభించిపోగా రాలేని పరిస్థితి నెలకొంది.

ఎస్సై ఆవుల తిరుపతి స్పందించి పోలీసు వాహనాన్ని సిబ్బంది సాయంతో మహిళ ఇంటికి తీసుకువెళ్లి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పోలీస్ సేవలను స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభినందించారు.

ఇవీ చూడండి: కేటీఆర్​ చొరవతో వాగులో చిక్కుకున్న 10 మంది రైతులను కాపాడిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.