పగలు-రాత్రి తేడా లేకుండా... ఎవరు... ఎటువైపు నుంచి వైరస్‌ను తెస్తాడోనన్న అందోళనలోనూ కరీంనగర్‌ను కంటికిరెప్పలా కాపాడుతున్నారు పోలీసులు. ఎండ మాడు పగులగొడుతున్నా... దోమలు రక్తం పీల్చుతున్నా... పై అధికారుల ఆజ్ఞలను పాటిస్తున్నారు. అడ్డదిడ్డంగా రోడ్ల మీదకొచ్చే జనాన్ని క్రమశిక్షణలో పెడుతూ ప్రజలను కరోనా కంట్లో పడకుండా చేస్తున్నారు.
నగరవాసులందరినీ సుఖంగా నిద్రపోయేలా భరోసానిచ్చి తాము మాత్రం... కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ముక్రంపుర ,కశ్మీరుగడ్డ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను చూస్తే సెల్యూట్ చేయక తప్పదు. రక్తం పీలుస్తున్న దోమల నుంచి తమని తాము రక్షించుకునేందుకు దోమతెరలు కట్టుకొని మరీ విధులు నిర్వర్తిస్తూ... శభాష్ అనిపించుకుంటున్నారు.