కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఆరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్లో పండించిన వరి ధాన్యం తడిసి రంగు మారినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాలు రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. రైతుల ధాన్యం కొనుగోలుపై అపోహ పడవద్దని సూచించారు. అనంతరం రామడుగు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. రెవెన్యూ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.