ETV Bharat / state

మిగ్​జాం ఎఫెక్టు - ధాన్యం సేకరణ ఆలస్యం, ఆందోళనలో రైతన్నలు

Paddy Affected By Michaung Cyclone In Karimnagar District : ఎన్నికలు ఇతరత్రా కారణాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. తొలుత ఎన్నికల ప్రక్రియ కారణంగా అధికారులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించక పోగా ప్రస్తుతం మిజ్‌గాం తుఫాన్‌ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో 9.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా అక్టోబరు చివరి వారం నుంచే వరికోతలు చేపట్టారు. నెలరోజుల క్రితం నుంచే పెద్దఎత్తున కేంద్రాలకు ధాన్యం వచ్చినా సేకరణలోని జాప్యం రైతులను వేధిస్తోంది.

Mizgam Typhoon In Karimnagar
Paddy Affected By Mizgam Typhoon In Karimnagar
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2023, 9:15 PM IST

కరీంనగర్​లో తూఫాన్​ ప్రభావంతో తడుస్తున్న ధాన్యం - వరిని కోనుగోలు చేయాలని కోరుతున్న రైతులు

Paddy Affected By Michaung Cyclone In Karimnagar District : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వానాకాలంలో 9.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు నెల రోజుల నుంచే వరికోతలు చేపట్టారు. నెలరోజుల క్రితం నుంచే పెద్దఎత్తున కేంద్రాలకు ధాన్యం వచ్చినా సేకరణలోని జాప్యం రైతులను వేధిస్తోంది. జగిత్యాల జిల్లాలో గతేడాది సరిగ్గా ఇదేతేదీ వరకు 2.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈసారి 1.58 లక్షల టన్నులను మాత్రమే తీసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో గతేడాది 2.25 లక్షల మెట్రిక్‌ టన్నులను తీసుకోగా, ఈసారి 1.73 లక్షల మెట్రిక్‌ టన్నులను సేకరించారు. అప్పటితో పోలిస్తే ఈ సంవత్సరం వరినాట్లు ముందుగా వేయగా వరికోతలు ముందుగానే ప్రారంభమైనా సేకరణలోని ఆలస్యం, అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Heavy Rains In Telangana : మళ్లీ విరుచుకుపడిన అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం

Michaung Cyclone Effect In Karimnagar : నాలుగు జిల్లాల్లో కలిపి ప్యాక్స్‌, ఐకేపీ, మెప్మా, హాకా, డీసీఎంఎస్‌ల ద్వారా 1,281 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు సిరిసిల్ల జిల్లాలో 70, కరీంనగర్‌లో 19, పెద్దపల్లి జిల్లాల్లో 10 కేంద్రాల్లోనే సేకరణ ముగిసింది. అత్యధిక సాగు విస్తీర్ణం కలిగిన జగిత్యాల జిల్లాలో సేకరణ ఆలస్యం రైతులను వేధిస్తుండగా నాలుగు జిల్లాల్లోని మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ ధాన్యం నిల్వలు పెద్దఎత్తున సేకరణకు పడిఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎకరాకు సరాసరిగా 18-28 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా ఇందులో సన్నధాన్యం, యార్డుల్లో అమ్మకం, విత్తనవడ్లు, నేరుగా మిల్లుల్లో విక్రయించగా దాదాపు 35 శాతం వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంది.

Damaged Paddy Field Due To Cyclone In Telangana : ఒకవైపు కొనుగోలు ఆలస్యం అవుతుండగా మరోవైపు తుపాను ఆందోళనకు గురిచేస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజు టార్పాలిన్లు కప్పడం, తీయడం తప్ప కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలామంది మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యాన్ని 70 శాతానికి మించి ఇవ్వకపోవడంతో ఈసారి ధాన్యాన్ని కేటాయించలేదు. ఈ సమస్య కొంతవరకు జాప్యం కాగా ఇతర జిల్లాల్లోని మిల్లులకు కేటాయింపు, ధాన్యం నాణ్యత పరిశీలన, తూకం వేయటం, లారీల్లో బస్తాల తరలింపు, మిల్లులో దింపకం, ట్రక్‌షీట్లను జారీచేయటం, ఆన్‌లైన్‌లో నమోదు తదితరాల్లోనూ జాప్యం జరగటంతో రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు.

Paddy Procurement in TS : వర్షాలకు పడ్డ తిప్పలు చాలవా స్వామి.. అమ్మకానికి అవస్థలు పడాలా..?

Paddy Affected By Heavy Rain In Karimnagar : అకాల వర్షసూచన, కేంద్రాల్లో జాప్యంతో చాలామంది రైతులు నేరుగా మిల్లర్లకు, తక్కువ ధరకు గ్రామాల్లో మధ్యవర్తులకు, మార్కెట్​ యార్డుల్లో విక్రయిస్తున్నారు. ఇదే సమయంలో యాసంగి సీజన్‌ మొదలుకాగా ఇటు ధాన్యం డబ్బులు రాకపోవటం, రైతుబంధు సాయం అందకపోవటం తదితర కారణాలతో పెట్టుబడులకు రైతులు పెంపర్లాడుతున్నారు. తుపాను, అకాల వర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన దృష్ట్యా ఇప్పటికైనా ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.

Prathidwani: ఆరుగాలం శ్రమ వర్షార్పణం.. నష్టం భర్తీపై ఎలాంటి విధానం ఉంటే మేలు?

రాష్ట్రంలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు.. బస్తాకు రెండు కిలోల దోపిడీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.