జోన్ల విధానం అమలుకు కృషి చేసినందుకు గానూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్వీ సభ్యులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ చౌక్‌లో టీఆర్ఎస్వీ విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినందుకు యావత్ రాష్ట్ర విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అనిల్ కుమార్ అన్నారు.
ఈ జోనల్ వ్యవస్థ వల్ల రాష్ట్రంలోని 95 శాతం స్థానిక యువకులకే ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలకు ప్రధాన అడ్డంకి తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ నుంచి త్వరగా కోలుకొని రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి: కేసీఆర్