కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి కేసర్మల్ కార్వా జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. కొవిడ్ బాధితులకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో రూ.7లక్షల విలువైన యంత్రాలను జిల్లా కలెక్టర్ శశాంకకు అందించారు.
కొవిడ్ కారణంగా చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసి తమవంతు సాయం అందిస్తున్నట్లు వివరించారు. కష్టకాలంలో మరింత మంది ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.