ETV Bharat / state

కారును అధిగమించబోయి.. బైక్​ పైన అనంతలోకాలకు..! - latest news on one person died in road accident in karimnagar

ముందు వాహనాన్ని అధిగమించబోయిన ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్​ జిల్లాలో చోటుచేసుకుంది.

one person died in road accident in karimnagar
అధిగమించబోయి.. అనంతలోకాలకు
author img

By

Published : Mar 10, 2020, 11:26 AM IST

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్​ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. లారీ కిందికి దూసుకెళ్లింది. ప్రమాదంలో రాజేందర్​ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు రాకేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి.

హుస్నాబాద్​కు చెందిన జన్నోజు రాజేందర్ అలియాస్ దత్తు(34) కరీంనగర్​లో నివాసం ఉంటూ.. వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడైన మంద రాకేశ్​తో కలిసి తిమ్మాపూర్ మండలంలోని నల్లగొండకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అలుగునూర్ కూడలి వద్ద ముందు వెళ్తున్న ఓ కారును అధిగమించే క్రమంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి.. పక్కనే వెళుతున్న లారీ వెనుక చక్రాల కిందికి దూసుకుపోయింది.

ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే మృతిచెందగా... గాయాలైన రాకేశ్​ను స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ మహేశ్​ గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధిగమించబోయి.. అనంతలోకాలకు

ఇదీ చూడండి: దలాల్​ స్ట్రీట్​ ఢమాల్​- సెన్సెక్స్​ రికార్డు పతనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.