ETV Bharat / state

Vinod kumar: ఉన్నవాళ్లకే ప్రభుత్వ పథకాలు.. వినోద్​కుమార్​ను నిలదీసిన వృద్ధుడు

మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ను ఓ వృద్ధుడు నిలదీశాడు. ఉన్నవాళ్లకే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

vinod kumar
వినోద్​ కుమార్​
author img

By

Published : Jul 6, 2021, 10:36 PM IST

Vinod kumar: ఉన్నవాళ్లకే ప్రభుత్వ పథకాలు.. పేదవాడి ఆవేదన

హుజూరాబాద్​ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. తాజాగా జమ్మికుంటలో మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​ కుమార్​ను పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా కొత్తపల్లిలో నిర్మిస్తున్న మురుగు కాల్వను పరిశీలించడానికి వెళ్లిన ఆయనను ఓ వృద్ధుడు నిలదీశాడు. ప్రభుత్వ పథకాలన్నీ ఉన్నవాళ్లకే తప్ప లేని వారికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ పనులు చేయిస్తున్నారని, లేకపోతే మమ్మల్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా అని బాషుమియా.. వినోద్​ కుమార్​ను ప్రశ్నించాడు. వినోద్‌కుమార్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా లేదా అని అడిగారు. దీనికి బాషుమియా సమాధానం ఇస్తూ మా ప్రాంతం ఏం అభివృద్ధి జరగలేదు. అంతా వాళ్లవైపే జరిగిందని అన్నాడు.

24 కరెంటు వస్తుందా.. లేదా అని వినోద్​ అడగగా.. కరెంట్ వచ్చేదే కొత్తేముందని వృద్ధుడు చెప్పాడు. నీకు భూమి ఉందా అని ప్రశ్నించగా.. తమకు ఉండడానికి ఇళ్లు కూడా లేదని చెప్పాడు. వందల ఎకరాలున్నోళ్లకే రైతుబంధు వస్తుందన్నారు. వాదన మరింత ముందుకు సాగకుండా వృద్ధుడిని స్థానిక తెరాస నాయకులు అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది రోజుల క్రితం పరకాల ఎమ్మెల్యేను కూడా గ్రామస్థులు నిలదీశారు.

ఇదీ చదవండి: Harish Rao: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీర నీరందిస్తాం: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.