కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో యూనియన్ బ్యాంకు ముందు రైతులు బారులు తీరారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరపెడుతుంటే.. వారు మాత్రం అవేమీ పట్టనట్లు.. అసలు భౌతిక దూరమనే నియమాన్నే మరచి నిలబడ్డారు. పంట రుణాల కోసం బ్యాంకుకు చేరుకున్న అన్నదాతలు కనీసం మాస్కులు కూడా ధరించకుండా వచ్చారు.
ఈ పరిస్థితిని చూసిన కొందరు ఆందోళన పడుతున్నారు. తాము కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తుంటే వీరు మాత్రం అవేమీ పాటించట్లేదని భయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కరోనా దరిచేరకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.