కరీంనగర్ ఇరుగు పొరుగు జిల్లాలకు కేంద్ర బిందువు కావడంతో వైద్యం కోసం పెద్ద ఎత్తున వస్తుంటారు. తమవారు దవాఖానాల్లో చికిత్స పొందుతుంటే సహాయకులు బయట పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆకలికీ అవస్థలు పడాల్సిన దుస్థితి. అలాంటి వారి ఆకలిని పలువురు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు తీరుస్తున్నాయి.
ఇటుక బట్టీల్లోని కార్మికులకు..
ప్రధానంగా కరీంనగర్ శివారు గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూలీలు వస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆ కూలీలకు ఉపాధి దొరక్క.. తిండి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి స్వచ్చంధ సంస్థలు నిత్యావసర సరుకులు అందజేస్తున్నాయి. అలాగే ఆర్టీసీ బస్టాండుల్లో మధ్యాహ్నం మాత్రమే భోజన సదుపాయం కల్పిస్తుండగా.. రాత్రి వేళ్లలో మాత్రం కడుపు మాడ్చుకోవల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వారిని ఎంపిక చేసి పౌష్టిక ఆహారం అందజేయడం సంతృప్తి నిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు..
ఏయే ప్రాంతాల్లోనైతే ఆకలితో అలమటించే వారుంటారో అక్కడ స్వచ్చంధ సంస్థల ఫోన్ నంబర్లు రాస్తూ అలా ఇబ్బంది పడేవారి సమాచారం ఇవ్వండని ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి: Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్