ETV Bharat / state

huzurabad by election: విమర్శలే ప్రధాన అస్త్రాలు.. కానరాని భవిష్యత్‌ ప్రణాళిక - హుజూరాబాద్​లో పార్టీల ప్రచారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారం(huzurabad by election campaign) ... విమర్శలు, ఆరోపణలతో సాగుతోందన్న చర్చ సాగుతోంది. ఏ ఎన్నిక అయినా భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేయబోయే ప్రణాళికల గురించి చెప్పి ఓట్లు అడుగుతారు.. కానీ ఈ ఎన్నికల ప్రచారం మాత్రం గతానికి భిన్నంగా సాగుతోంది.

huzurabad by election
huzurabad by election
author img

By

Published : Oct 14, 2021, 4:19 AM IST

హూజూరాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నాయకులు వ్యక్తిగత విమర్శలకు ఇచ్చిన ప్రాధాన్యత... అభివృద్దికి ఇవ్వడం లేదనే అభిప్రాయం స్థానికుల్లో నెలకొంది (huzurabad by election campaign). ఓట్లు వేసేది ఇక్కడి ప్రజలే అయినా... ప్రచారంలో నేతలు మాత్రం వ్యక్తిగత ఆరోపణలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయా పార్టీలు కౌంటర్లు, ఎన్‌కౌంటర్లతోనే ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఎవరికి వారు తమ తప్పులను కప్పి పుచ్చుకుంటూ... ప్రత్యర్థుల తప్పిదాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికుల అవసరాలు, సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను విస్మరిస్తున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న ఇరుపార్టీలు

హుజూరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు విమర్శలే ప్రధాన అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఓటర్ల స్థితిగతులను మార్చేందుకు ఏమేం చేయబోతున్నారనే ఊసేలేదు. కేసీఆర్ అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్యే ఈ ఎన్నికలని... భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ (etela rajendar) నినదిస్తున్నారు. ఈటల స్వార్థం వల్లే ఎన్నికలు వచ్చాయంటూ తెరాస నేతలు (trs leaders) వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీలపై ధ్వజమెత్తుతూ ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. అయితే స్థానికుల అవసరాలేమున్నాయి, నియోజకవర్గ అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన పనులేంటి అన్న విషయం గురించి అంతగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగుల అంశంలోను అదే ధోరణి

ఏళ్లు తరబడి సర్కారు కొలువుకోసం ఎదురు చూస్తూ నిరుద్యోగుల గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. నోటిఫికేషన్లు (employment notification) విడుదల చేయడం లేదని ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. త్వరలో 80 వేల ఉద్యోగాల (80 thousand jobs) నియామక ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో (by election) కచ్చితంగా నోటిఫికేషన్ల గురించి ప్రస్తావన వస్తుందని భావించారు. కానీ ఆ ఊసేలేకపోగా.. నియోజకవర్గ స్థాయిలో ఇక్కడి యువతకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఎవరూ ప్రకటించడం లేదు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, ప్రజల సంక్షేమం కోసం ఏంచేస్తామనే.. మేనిఫెస్టోను (election manifesto) కూడా విడుదల చేయలేదు. కేవలం రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలను లేవనెత్తడం, ఆరోపణలు చేస్తుండటం వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యల గురించే ఊసేలేదు.

ఇదీ చూడండి: Trs Complaint To Ec: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు'

Etela Fire on Kcr: 'కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.