ETV Bharat / state

'ప్రభుత్వ అసమగ్ర విధానాలతో వలస కూలీలు ఇక్కట్లు:బండి'

author img

By

Published : Apr 17, 2020, 12:46 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

Breaking News

లాక్​డౌన్ కొనసాగుతున్న క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అసమగ్ర, అసంబద్ధ విధానాలతో వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రేషన్ సరుకులు లభించని వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునే సమయంలో కూడా ప్రభుత్వం సరైన విధానం ప్రకటించలేదన్నారు. కొన్ని గ్రామాల్లో టోకెన్లు, మరికొన్ని గ్రామాల్లో లాటరీ పద్ధతి అవలంబిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. పీపీఈ కిట్ల వినియోగంలోనూ ప్రభుత్వం లోపభూయిష్టంగా వ్యవహరిస్తుందని ఎంపీ బండి​ విమర్శించారు.

'ప్రభుత్వ అసమగ్ర విధానాలతో వలసకూలీలు ఇక్కట్లపాలవుతున్నారు'

ఇదీ చూడండి: సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.