కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట, గుమ్లాపూర్ గ్రామాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న సీసీ రోడ్లను పార్లమెంట్ సభ్యుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రుక్మాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు బీమా చెక్కులు అందజేశారు.
ఈ క్రమంలోనే మూడు గ్రామాల స్థానికులతో మాట్లాడి.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, భాజపా జిల్లా అధ్యక్షుడు గొంగిడి కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల యువత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి: కోదండరాం