కరీంనగర్ మేయర్ సునీల్‌రావు తన డివిజన్ పరిధిలోని 700 మంది పేదలకు నిత్యావసరాలను, రూ. 500 నగదును పంచి పెట్టారు. ఇంటింటికి తిరుగుతూ వీటిని అందజేశారు. ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, నగదుతో పాటు తాను ఇచ్చే వస్తువులు వారు పస్తులు ఉండకుండా కాపాడతాయని మేయర్ చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించవద్దని సూచించారు. పేదలకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సునీల్‌రావు కోరారు.
ఇవీచూడండి: కరోనా విపత్కర కాలంలో... పోలీసుల ఔదార్యం