ETV Bharat / state

MLC Kavitha Fires on BJP and Congress : 'బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు' - కాంగ్రెస్​ మరియు బీజేపీలపై కవిత ఫైర్​

MLC Kavitha Fires on BJP and Congress : బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్​ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు లాంటివని.. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని కవిత విమర్శించారు. అలాగే గుత్తా సుఖేందర్​ రెడ్డి కూడా అదే రీతిలో విమర్శలు చేశారు.

MLC Kavitha
MLC Kavitha Fires on BJP and Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 2:42 PM IST

MLC Kavitha Fires on BJP and Congress బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీవి దిగజారుడు మాటలు

MLC Kavitha Fires on BJP and Congress : బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ హామీ(Telangana Congress Manifesto 2023)లను కాపీ చేసే దుస్థితి దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదని విమర్శించారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్​ఎస్​ సర్కార్​ పాలనలో.. అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలంగాణకు ఏం తీసుకువచ్చారో చెప్పాలని కవిత ప్రశ్నించారు.

MLA Kavitha on BRS Manifesto 2023 : బీఆర్​ఎస్​ మేనిఫెస్టో(BRS Manifesto 2023)తో కాంగ్రెస్​, బీజేపీలో గుబులు మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్​ పార్టీనే అని.. అమరజ్యోతి వద్దకు వచ్చి నివాళులర్పించే ధైర్యం రాహుల్​ గాంధీకి ఉందా అంటూ సవాల్​ విసిరారు. అక్కడకు వచ్చి నివాళులు అర్పిస్తే కాంగ్రెస్​ చేసిన పాపాలు కొన్నయినా తొలుగుతాయని అన్నారు. కాంగ్రెస్​ గ్యారెంటీ(Congress Six Guarantees)లు టిష్యూ పేపర్ల లాంటివని.. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరిందని కవిత విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీలు ఏమయ్యాయని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 119 స్థానాల్లో ఒక్క చోట కూడా బీజేపీకి డిపాజిట్​ రాదని ఎద్దేవా చేశారు.

BRS Manifesto 2023 : తెల్లరేషన్‌ కార్డుదారులకు 'కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా'.. రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌

"బీఆర్​ఎస్​ మేనిఫెస్టోపై కాంగ్రెస్​, బీజేపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ హామీలను కాపీ చేసే దుస్థితి దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు.కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి తెలంగాణకు ఏం తీసుకువచ్చారో చెప్పాలి? బీఆర్​ఎస్​ మేనిఫెస్టోతో కాంగ్రెస్​, బీజేపీలో గుబులు మొదలైంది. కాంగ్రెస్​ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు లాంటివి. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ ఆరితేరింది." -కవిత, ఎమ్మెల్సీ

Gutta Sukhender on BRS Manifesto : మరోవైపు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీజేపీకి లేదని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలందరికీ ఆమోదదాయకంగా ఉందని.. అన్ని వర్గాల ప్రజలు దీనిపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఆయన​ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ మేరకు మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారెంటీలు.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలెవరు లేరని గుత్తా సుఖేందర్​ పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలపై కాంగ్రెస్​, బీజేపీ అర్థంలేని విమర్శలు : రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్, బీజేపీలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఉచిత పథకాలపై విమర్శలు చేస్తున్న జాతీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో అవే పథకాలను ఎందుకు పొందుపరుస్తున్నాయని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు.

Revanth Reddy Reacts on BRS Manifesto : 'కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారు'

Kishan Reddy Reaction on BRS Manifesto : బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ప్రజలెవరూ నమ్మడం లేదు : కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.