రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై చేస్తున్న ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. యాసంగి పంటలో అగ్గి తెగులు, మెడవిరుపు తెగులుతో ఇబ్బంది పడ్డ రైతులు తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాల్లో తాళ్లు పేరుతో తిరస్కరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ వేళ రైతులను ఇబ్బందిపెడితే విధిలేని పరిస్థితుల్లో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కందులు విక్రయించిన రైతులకు నేటికీ డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. మరోవైపు మామిడి రైతులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.