ETV Bharat / state

'ఆ ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుంది' - తెలంగాణ వార్తలు

దోబీ ఘాట్లు, సెలూన్లకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తెలిపారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు తెరాసకు అండగా ఉండాలని కోరారు. కరీంనగర్ జిల్లా కిష్టపేటలో జరిగిన కుల సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎమ్మెల్యే బసవరాజు సారయ్య
mlc baswaraju saraiah, trs
author img

By

Published : Jun 13, 2021, 11:40 AM IST

నాయీ బ్రహ్మణులు, రజకులు తెరాస ప్రభుత్వానికి అండగా ఉండాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన కుల సంఘాల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దోబి ఘాట్లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్​ అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంట్ అందించి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారని గుర్తుచేశారు.

ఏడాదికి రూ.4వందల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలు తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.