కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెక్కులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంపై శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారినా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై అధిక ప్రాధాన్యత చూపుతున్నారని స్పష్టం చేశారు.
కల్యాణలక్ష్మి లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కమీషన్ల కోసం 4 జిల్లాలను ఎండబెడుతున్నారు'